![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతన్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -246 లో.. స్వప్నని ఎలాగైనా దుగ్గిరాల ఇంట్లో ఉంచకూడదనే ఉదేశ్యంతో కనకం స్వప్న దగ్గరికి వస్తుంది. కావ్య జీవితాన్ని నాశనం చేసావ్. నువ్వు చేసిన తప్పుకి కావ్య శిక్ష అనుభవిస్తుందని స్వప్నని తిడుతుంది కనకం. అది నువ్వు అనుకునేంత అమాయకరాలేం కాదు. దానికి నిజం తెలిసిన తనకి ప్రాబ్లమ్ అవుతుందని అలోచించి చెప్పలేదని స్వప్న అనగానే కనకానికి మరింత కోపం వస్తుంది.
ఆ తర్వాత దీని అంతటికి కారణం నువ్వే నన్ను చిన్నప్పటి నుండి గొప్పగా కలలు కనేల పెంచావ్.. గొప్ప ఇంటికి కోడలిని చేస్తాను. ధనవంతురాలు లాగే నటించాలని చెప్పేదానివి. మొదటగా నువ్వు మనం ధనవంతులమని అబద్దం చెప్పావ్. దానివల్లే ఇప్పుడు నేను ఇంకొక అబద్దం చెప్పాల్సి వచ్చిందంటూ మొత్తం తప్పు కనకానిదే అన్నట్లు స్వప్న మాట్లాడుతుంది. ఇలా స్వప్న మాట్లాడేసరికి.. నువ్వు ఇక్కడ ఉంటే కావ్య జీవితం బాగుండదు పద అని కనకం అనగానే.. నా జీవితంలో నీ పాత్ర అయిపోయింది. ఇది నా అత్త ఇల్లు ఇక్కడే ఉంటానని కనకాన్ని అవమానించి గది బయటకు తోసేసి కనకం మొహం పైనే డోర్ వేసుకుంటుంది స్వప్న. కనకం బాధపడుతు వెళ్లడం చూసిన కావ్య.. ఏమైంది అని అడుగుతుంది. జరిగిందేదీ చెప్పకుండా కనకం వెళ్ళిపోతుంది.
.webp)
ఆ తర్వాత కనకం ఇంటికి వెళ్లి కృష్ణమూర్తి, అప్పులకి స్వప్న అన్న మాటలు చెప్పుకుంటు బాధపడుతుంది. అన్ని మాటలు అన్న దాన్ని ఎందుకు వదిలేసావని అప్పు అడుగుతుంది. ఆ తర్వాత కనకానికి కావ్య ఫోన్ చేసి ఇంటికి ఎందుకు వచ్చావని అడుగుతుంది. స్వప్నకి నచ్చజెప్పలని ప్రయత్నం చేశానని కనకం చెప్తుంది. అయినా వింటుంద వినేదైతే ఎందుకు ఇలా చేస్తుంది. నువ్వు నా గురించి ఏం టెన్షన్ పడకని కనకానికి కావ్య చెప్తుంది. మరొకవైపు స్వప్న చేసిన తప్పుకి కావ్యకి అన్యాయం జరగకూడదని ఇందిరాదేవి ధాన్యలక్ష్మి ఇద్దరు అపర్ణకి నచ్చజెప్పాలని ప్రయత్నిస్తారు. అయిన అపర్ణ వినకుండా రేపు మీరు అలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది. మరొక వైపు రాజ్ , కావ్యల పెళ్లి ఫోటోని రాజ్ కాల్చి వేస్తుంటాడు. అప్పుడే కావ్య వస్తుంది. అది చూసిన కావ్య.. మీరు చాలా దూరం వెళ్తున్నారని అంటుంది. ఈ దూరం శాశ్వతం కావాలని కోరుకుంటూన్నానని రాజ్ అంటాడు. రేపటి నిర్ణయంతో మన బంధానికి తెరపడాలని అనుకుంటున్నానని రాజ్ చెప్పి వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత కావ్య బాధపడుతుంది. మనం బురదలో పడ్డాం. ఆ మట్టి వాసన మన దుగ్గిరాల వంశానికి అంటకముందే కడిగేసుకుంటే మంచిది. ఇందులో స్వప్న పాత్ర ఎంత ఉందో, కావ్య హస్తం అంతే ఉంది. ఇంత దాకా వచ్చాక స్వప్నతో పాటు కావ్య ని కూడా పంపించాలని రాజ్ కి విడాకులు ఇప్పిద్దామని అపర్ణ కఠినంగా మాట్లాడుతుంది. దుగ్గిరాల కుటుంబం ఎప్పుడు కావ్యకి సపోర్ట్ గా ఉంటుంది. మరి ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకోనుందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |